ఘర్షణ కేసులో సెటిల్ మెంట్ నిమిత్తం స్టేషన్ కు వచ్చిన బాలుడిపై వేమూరు ఎస్సై దాడి చేశారని బాధితుడి బంధువులు ఆరోపిస్తున్నారు. రెండు గ్రూపుల మధ్య ఘర్షణ జరగగా అందుకు కారణంగా భావిస్తున్న బాలుడిని స్టేషన్ కు రప్పించారు పోలీసులు. తల్లితండ్రులను బయటకు పంపి విచారిస్తూ కానిస్టేబుళ్లతో కలిసి ఎస్ ఐ తనపై కత్తితో దాడి చేశాడని బాలుడు ఆరోపిస్తున్నాడు.